
స్కూల్ నుంచి పారిపోయిన పిల్లలు
రేణిగుంట: మండలంలోని కరకంబాడిలో ముగ్గురు పిల్లలు తిరుగుతుండగా వారిని రేణిగుంట పోలీసులు వారు విచారించి వారిని మాతృశ్రీ చైల్డ్ హోమ్‌కు అప్పగించారు. తిరుపతి బైరాగి పట్టెడలో ఉన్న మాతృశ్రీ చైల్డ్ హోమ్‌లో ఉంటూ ప్రయివేటు స్కూల్లో చదువుతున్న లంకేష్ (9), సహదేవ (11), ముఖేష్ (12) ఇంగ్లీష్ మీడియం చదవడం కష్టంగా ఉందంటూ పాఠశాల నుంచి పారిపోయారు. వారిని పోలీసులు సోమవారం పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి విచారించారు. అనంతరం మాతృశ్రీ చైల్డ్ హోమ్ వారిని పిలిపించి వారికి అప్పగించారు.