
చోరీపై క్లూస్‌టీం విచారణ
నాయుడుపేటటౌన్: నాయుడుపేట పట్టణంలోని ముకాంభిక గుడి వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేందర్ ఇంటిలో ఆదివారం చోరీ జరిగిన ప్రాంతాన్ని క్లూస్ టీంతో పోలీసులు విచారణ చేశారు. దుండగులు బీరువాలో దాచి ఉంచిన 55 సవర్లు బంగారు నగలు చోరీ అయ్యాయి. కాగా బీరువా లోపలి అరలో దాచి ఉంచిన రూ.3 లక్షల నగదును అలానే ఉండడడాన్ని సీఐ బాబి గుర్తించారు. అయితే దుండగులు ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఇంటిలో చొరబడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమలలో కార్డన్ సెర్చ్
తిరుపతి క్రైమ్ : తిరుమలలోని పాప వినాశనంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాప వినాశనంలోని 140 షాపులను తనిఖీ చేసి 40 అనధికారికంగా ఉన్న లైసెన్సులను గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

చోరీపై క్లూస్‌టీం విచారణ