
యోగ నిద్రలో నరసింహుడు
– పెంచలకోనలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు
రాపూరు : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, పెంచలయ్యస్వామి మాట్లాడుతూ తొలి ఏకాదశినాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రకు ఉప క్రమిస్తారని తెలిపారు. తొలిఏకాదశి పర్వదినం సందర్భంగా నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్నట్లుగా శ్రీవారి కల్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలు ,ఆభరణాలతో అలంకరించారు. శ్రీవారికి 15 రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంపిణీ చేశారు.
శేషవాహనం స్వామి అమ్మవార్లు
తొలిఏకాదశి సందర్భంగా శేష వాహనంపై లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు.

యోగ నిద్రలో నరసింహుడు