
విద్యుత్ బస్సుల కేటాయింపు వరం – ఈడీ
● త్వరలో జిల్లాకు 50 విద్యుత్ బస్సులు
తిరుపతి అర్బన్ : తిరుపతికి విద్యుత్ బస్సుల కేటాయింపు ఓ వరంగా భావించాల్సి ఉందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈడీ) తిమ్మాడి చెంగల్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలోని డీపీటీవో కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చిన విజ్ఞానజ్యోతి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వారు విద్యుత్ బస్సుల శిక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ.. 2021లో జిల్లాలో 100 విద్యుత్ బస్సులను కేటాయించిన అంశాన్ని గుర్తుచేశారు. విద్యుత్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉన్నాయని. కాలుష్య నియంత్రణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అలాగే జిల్లాకు త్వరలో మరో 50 విద్యుత్ బస్సులు రానున్నాయని చెప్పారు. ఈ కొత్త సర్వీసులను మంగళం డిపో కేంద్రంగా నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో డీపీటీవో జగదీష్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు సిద్ధంకండి
రానున్న తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ ఈడీ తిమ్మాడి చెంగల్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన డీపీటీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమలకు నడుపుతున్న సర్వీసులను ముందుస్తు ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీపీటీవో జగదీష్, డిప్యూటీ చీప్ మెకానిక్ ఇంజనీర్ బాలాజీ, డిప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, అసిస్టెంట్ ఇంజినీర్ మహేంద్ర పాల్గొన్నారు.

విద్యుత్ బస్సుల కేటాయింపు వరం – ఈడీ