
సనాతన ధర్మ ప్రచారానికి ప్రాధాన్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : యువతను భక్తిమార్గం దిశగా నడిపించేందుకు సనాతన ధర్మ ప్రచారానికి ఎస్వీబీసీలో ప్రాధాన్యమిచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ ఈఓ శ్యామలరావు ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ తిరుమల ప్రాముఖ్యత, వైష్ణవ సాంప్రదాయాలు, పచ్చదనం, దాస సాహిత్యం, భక్తులకు అందిస్తున్న సేవలు, హైందవ ధర్మ మూలాలను పిల్లలక సైతం తెలియజేయాలన్నారు. భజన సంప్రదాయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సృజనాత్మక కార్యక్రమాలను ప్రసారం చేయాలని స్పష్టం చేశారు. వర్చువల్‌గా అడిషనల్ ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్‌డీ పద్మావతి పాల్గొన్నారు.