
చీటింగ్ కేసులో నిందితుడి అరెస్ట్
బుచ్చినాయుడుకండ్రిగ : కార్లను అద్దెకు తీసుకుని నగదు చెల్లించకుండా, వాహనాలను తిరిగి అప్పగించకుండా మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన జావీద్, శివ వద్ద ఐదు కార్లను నెల బాడుగకు సత్యవేడు మండలం మాదనపాళెం గ్రామానికి చెందిన చెంగయ్య అలియాస్ ప్రవీణ్ తీసుకున్నాడు. ఒక్కో కారుకు రూ.45వేల చొప్పున అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక్క నెల మాత్రం బాడుగ సొమ్ము చెల్లించాడు. తర్వాత అద్దె నగదు ఇవ్వకుండా, కార్లను సైతం అప్పగించకుండా మోసం చేశాడు. దీంతో బాధితులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు చెంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తెలిపారు.