
రేషన్ బండి..
● ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం ● వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లోనే సరుకులు తీసుకోవాలి ● వలంటీర్లను తీసివేయడంతో ఇప్పటికే నిలిచిన ఇంటింటా సేవలు ● రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి పడిగాపులే ! ● న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్న ఎండీయూ ఆపరేటర్లు
●
పోరాటాలు చేస్తాం..
మాకు న్యాయం జరిగేవరకు పోరాటాలు చేస్తాం. బ్యాంకుల్లో రుణం తీసుకుని ఎండీయూ వాహనాలు తెచ్చుకున్నాం. ప్రతి నెలా ఈఎంఐ కట్టాల్సి ఉంది. ఆ నగదు ఎలా కట్టాలి ? ఒక్కసారిగా మమ్మల్ని రోడ్డున పడేయడం ఈ ప్రభుత్వానికి న్యాయమేనా ? మాకు భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఉంటారనే ఆలోచన లేకుండా వదిలేస్తే ఎలా? సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఎండీయూ వాహనాల రద్దు విషయంలో పునరాలోచన చేయాలి. – డి.హరికృష్ణ,
ఎండీయూ ఆపరేటర్, వాకాడు మండలం
తిరుపతి అర్బన్ : ఇన్నాళ్లూ ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు అందించిన బండి వచ్చే నెల నుంచి ఆగిపోనుంది. ఇంటింటికీ వెళ్లి రేషన్ అందించే విధానాన్ని చాలా రాష్ట్రాలు అభినందించడమే కూటమి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే కుంటిసాకులు చెబుతూ వాహనాలను రద్దు చేస్తూ వచ్చే నెల నుంచి ప్రజలు తమ పరిధిలోని డీలర్ల దుకాణాల వద్దకే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎండీయూ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. న్యాయం కోసం పోరాటాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు కార్డుదారులు మళ్లీ రేషన్ దుకాణం వద్ద క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు తప్పవా అంటూ నిట్టూరుస్తున్నారు. జిల్లాలో పని చేస్తున్న 369 ఎండీయూ వాహనాలను నిలుపుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ రేషన్ సరుకుల్లో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు కూడా అరకొర ఇస్తున్నారే తప్ప అందరికీ అందడం లేదు. సరుకులే సక్రమంగా ఇవ్వలేని కూటమి ప్రభుత్వం ఇక ప్రజలకు ఏమి మంచి చేస్తుందని మండిపడుతున్నారు.
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం..
మాకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తాం. ఏ తప్పు చేశామని మమ్మల్ని తొలగించారు ? అప్పటి ప్రభుత్వం ఏం చెబితే అదే చేశాం. కూటమి ప్రభుత్వంలోనూ ఏం చెబితే అదే చేశాం. విజయవాడ వరదల సమయంలో అక్కడకు వెళ్లాలని చెబితే ఆ మేరకు తిరుపతి జిల్లా నుంచి వెళ్లాం. ఎంతో మందికి ఇంటింటికీ వెళ్లి బియ్యం అందించాం. సీఎం చంద్రబాబునాయుడుకు మా సేవలు గుర్తుకు రావడం లేదు. – గిరికుమార్, ఎండీయూ వాహన ఆపరేటర్
రాజకీయ రంగు వద్దు..
రెక్కాడితేగానీ డొక్కనిండని బతుకులు మావి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాయం చేస్తామంటే వెళ్లాం. సబ్సిడీపై ఎండీయూ వాహనాలు ఇప్పించారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాయం చేస్తామంటే వెళ్తాం. అంతే తప్ప అప్పటి ముఖ్యమంత్రి ఎవరికి సాయం చేశారో వారిపై కక్ష సాధిస్తామంటే న్యాయమా సార్ ? మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక కక్ష సాధించమని చెప్పినట్లుగా ఉంది ఈ ప్రభుత్వం తీరు.
– అస్త్రాష్, ఎండీయూ వాహనం ఆపరేటర్
సామాన్య ప్రజలపై కక్ష సరికాదు..
ప్రభుత్వాలు మారినప్పుడల్లా కక్ష సాధింపు నిర్ణయాలు తీసుకుంటే సమాజానికి పెను ప్రమాదం తప్పదని భావిస్తున్నాం. 2029 ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే మళ్లీ ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏంటి! ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేసిన వాటిని వచ్చే ప్రభుత్వం రద్దు చేస్తే ? ఈ వి షయాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాల్సి ఉంది. నేతలపై కోపాన్ని సా మాన్య పేద ప్రజలపై చూపడం సరికాదు. మాకు న్యాయం చేయండి.
– పార్థసారథి, ఎండీయూ ఆపరేటర్, తిరుపతి అర్బన్
ఆలోచన చేయాలి కదా..
కూటమి ప్రభుత్వం మంచి చెడులను ఆలోచన చేయాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి కల్పిస్తామంటే వెళ్లాం. ఆయన ఎండీయూ వాహనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మాలాంటి వాళ్లందరికీ ఉపాధి కల్పించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబునాయుడు మాపై కక్ష్య సాధించడం ఏ మాత్రం న్యాయం కాదు.
– కుమార్, ఎండీయూ ఆపరేటర్, బీఎన్ కండ్రిగ మండలం

రేషన్ బండి..

రేషన్ బండి..

రేషన్ బండి..

రేషన్ బండి..

రేషన్ బండి..

రేషన్ బండి..