
మహిళా రక్షణకు మిషన్‌శక్తి వన్ స్టాప్ సెంటర్
తిరుపతి అర్బన్: మిషన్‌శక్తి వన్‌స్టాప్ సెంటర్‌ను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళల లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, అక్రమ రవాణా, గృహ హింస, బాల్య వివాహాలు, కిడ్నాపింగ్, సైబర్ నేరాలు తదితర అంశాల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి మిషన్ శక్తి వన్‌స్టాప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉచిత న్యాయ రక్షణ, వైద్యం, కౌన్సెలింగ్, వసతి సాయం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181పై అవగాహన కల్పించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ వసంత బాయి, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్, డీసీహెచ్‌ఎస్ ఆనందమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నేడు జాబ్‌మేళా
జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. అదనపు సమాచారం కోసం 918639835953 ,9700561225, 9988853335లో సంప్రదించాలని సూచించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం, ఉపాధికల్పనాధికారి వెంకటరమణ, డీఎల్‌డీఓ నారాయణరెడ్డి, గణేష్ పాల్గొన్నారు.
వాట్సాప్ మనమిత్ర సేవలు
ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ మనమిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతో కలసి వాట్సాప్ మనమిత్రను ఆవిష్కరించారు. జిల్లా సచివాలయ అధికారి నారాయణరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్ జగదీష్ పాల్గొన్నారు.