
మార్కెట్‌లోకి ‘కియా కారెన్స్’
చంద్రగిరి : తిరుచానూరు సమీపంలోని హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూమ్‌లో శనివారం కియా కారెన్స్ నూతన కారును ఆవిష్కరించారు. ఎండీ సి.జగన్నాథరెడ్డి, డైరెక్టర్ చెరకు నిరంజన్, సి.భారతి, సి.హోషిమారెడ్డితోపాటు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఎండీ మాట్లాడుతూ.. కియా నుంచి విడుదలైన కియా క్లావిస్ కారులో అత్యాధునిక సదుపాయాలు ఉన్నట్లు వెల్లడించారు. రోబస్ట్ 18 హై సేఫ్టీ స్టాండర్డ్, బెస్ట్ ఇన్‌సెగ్మెంట్ 26.62 ఇంచస్ డ్యూయల్ పానోరమిక్ డిస్‌ప్లే పానెల్, డ్యూయల్ పానె పానోరమిక్ సన్‌రూఫ్, బాస్ ప్రీమియం సౌండ్ సిస్టెహవిత్ 8 స్పీకర్ అడాస్ లెవల్ 2 విత్ 20 ఆటానమస్ ప్యూచర్ ఉన్నట్లు వివరించారు. 8 రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉందన్నారు. కారు బుకింగ్ కోసం 86888 29739 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షోరూమ్ సీనియర్ మేనేజర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.