పట్టుబట్టారు.. సాధించారు | - | Sakshi
Sakshi News home page

పట్టుబట్టారు.. సాధించారు

May 17 2025 7:05 AM | Updated on May 17 2025 7:05 AM

పట్టు

పట్టుబట్టారు.. సాధించారు

ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకుల పంట పండించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన విద్యార్థులు వారి మోములో చిరునవ్వులు చూడాలని కష్టాలకు ఎదురీది అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులతో సాక్షి ముచ్చటించింది.. వారి అభిప్రాయాలు ఇలా.. – తిరుపతి ఎడ్యుకేషన్‌

వ్యవసాయం చేసి చదివించారు..

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావడమే తన ముందున్న లక్ష్యం. ఏపీఈసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించా. మాది కడప సమీపంలోని ఖాజీపేట. మానాన్న శ్రీనివాసు వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించారు. నేను తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమో ఇన్‌ ఫార్మసీ చదివా.

– వీవీఎస్‌ఎస్‌ తరుణ్‌,

రాష్ట్ర స్థాయి 6వ ర్యాంకు, ఫార్మసీ విభాగం

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

మా నాన్న నారాయణ తిరుపతిలో ఆటో డ్రైవరు. ఇంటర్‌ తరువాత ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండేళ్ల ఫార్మసీ ఇన్‌ డిప్లొమో కోర్సును పూర్తి చేశా. ఏపీఈసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించా. నాలుగేళ్ల కోర్సు అయిన బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందనుండడం ఆనందంగా ఉంది. బీఫార్మసీ తరువాత సివిల్స్‌ సాధిస్తా.

– ఎ.కీర్తి, రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు, ఫార్మసీ విభాగం

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలని..

ఏపీఈసెట్‌ ఫలితాల్లో 7వ ర్యాంకు సాధించా. మానాన్న రమేష్‌బాబు చిన్న కిరాణం నడిపిస్తూ చదివిస్తున్నారు. ఇంటర్‌ తరువాత పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లొమో ఇన్‌ ఫార్మసీ పూర్తి చేశా. ఈసెట్‌ ఫలితాల్లో బీఫార్మసీకి అర్హత సాధించా. బీఫార్మసీ అనంతరం డ్రగ్‌ ఇన్‌స్పెక్టరుగా రాణించడమే తన లక్ష్యం.

– ఎస్‌.సుప్రజ, 7వ ర్యాంకు, ఫార్మసీ విభాగం

సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాలని..

ఏపీఈసెట్‌ సిరామిక్‌ టెక్నాలజీ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించా.మాది శ్రీకాళహస్తి మండలం, ఎనగలూరు. మానాన్న వెంకటసుబ్బయ్య వ్యవసాయం కుటుంబం. గూడూరులోని సిరామిక్‌ టెక్నాలజీ కళాశాలలో డిప్లొమో పూర్తి చేశా. బీటెక్‌ సీఎస్‌సీ విభాగంలో సీటు సాధించి సాఫ్ట్‌వేర్‌గా రాణించాలన్నదే తన ఆశయం.

– ముచ్చేలి కార్తిక్‌, స్టేట్‌ ఫస్ట్‌, సిరామిక్‌ టెక్నాలజీ

సివిల్‌ ఇంజినీర్‌గా

ఏపీఈసెట్‌లో 4వ ర్యాంకు సాధించా. మానాన్న కృష్ణమూర్తి తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తూ చదివించారు. తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ బ్రాంచ్‌ను సాధించా. బీటెక్‌లో చేరి మంచి సివిల్‌ ఇంజినీరుగా రాణించడమే తన లక్ష్యం.

–ఎ. శ్రీవెంకట్‌, 4వ ర్యాంకు, సివిల్‌ విభాగం

పట్టుబట్టారు.. సాధించారు1
1/6

పట్టుబట్టారు.. సాధించారు

పట్టుబట్టారు.. సాధించారు2
2/6

పట్టుబట్టారు.. సాధించారు

పట్టుబట్టారు.. సాధించారు3
3/6

పట్టుబట్టారు.. సాధించారు

పట్టుబట్టారు.. సాధించారు4
4/6

పట్టుబట్టారు.. సాధించారు

పట్టుబట్టారు.. సాధించారు5
5/6

పట్టుబట్టారు.. సాధించారు

పట్టుబట్టారు.. సాధించారు6
6/6

పట్టుబట్టారు.. సాధించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement