తిరుమల: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గు రువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మా వతి అతిథిగృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, ఈఓ శ్యామలరావ్, అదనపు వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. తర్వాత మన వుడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్న సత్రంలో ఒక్కరోజు అన్నదానంలో పాల్గొననున్నారు.
జిల్లాకు ఏడు కొత్త సర్వీసులు
తిరుపతి అర్బన్: జిల్లాకు ఏడు కొత్త సూపర్ ల గ్జరీ సర్వీసులు వచ్చాయి. గురువారం ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ కోసం మంగళం డిపోలో ఉంచారు.
పాత కక్షలతో వ్యక్తిపై దాడి
తిరుపతి క్రైమ్: పాత కక్షలతో ఓ వ్యక్తిపై దాడి చే శారు. ఈస్ట్ ఎస్‌ఐ బాలకృష్ణ కథనం.. తిరుపతి 16వ వార్డులో కల్లూరు తులసీరామ్ శానిటరీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతడిపై డీఆర్ మహల్‌కి చెందిన గౌరీశంకర్ మరో ఇద్దరితో వచ్చి గు రువారం కత్తులతో దాడి చేసి, పారిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గౌరీశంకర్ తండ్రి నాగరాజు ఆరేళ్ల క్రితం చోరీ కేసులో స్టేషన్‌కు పిలవడంతో ఆత్మహత్య చేసుకు న్నాడు. అప్పట్లో తులసీరామ్ తన కోడిని చోరీ చేశాడంటూ నాగరాజుపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయడంతోనే తన తండ్రి మరణించాడని పగబట్టి దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. గౌరీశంకర్ ఇప్పటికే దొంగతనంతోపాటు హత్యాయత్నం కేసుల్లో మైనర్‌గా ఉన్నప్పుడే జైలు కెళ్లాడని ఎస్‌ఐ తెలిపారు.