
విద్యార్థిని శరణ్యకు బహుమతి అందజేస్తున్న ప్రొఫెసర్ సుచరిత
తిరుపతి ఎడ్యుకేషన్ : విజయవాడలో 25న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు ఓజిలి మండలం, అరిమెనిపాడు జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థిని కె.శరణ్య ఎంపికైంది. తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్లో శుక్రవారం చిరుధాన్యాల ఆవశ్యకతపై జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను డీవైఈవో ఆనందరెడ్డి వివరించారు. అనంతరం చిరుధాన్యాల ఆవశ్యకతపై నిర్వహించిన పోటీల్లో కె.శరణ్య మొదటి స్థానం, వెంకటగిరిలోని ఏపీ మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని హర్షిత ద్వితీయ స్థానం, చంద్రగిరి బాలికల బీసీ సంక్షేమ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జ్యోత్స్న తృతీయ స్థానాన్ని సాధించారు. వీరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్, ఎస్వీయూ ప్రొఫెసర్ సుచరిత, రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనందరెడ్డి, క్యాంపస్ స్కూల్ హెచ్‌ఎం షకీన, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.