MP YS Avinash Reddy Key Comments Over CBI Investigation - Sakshi
Sakshi News home page

విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని కోరాము: అవినాష్‌ రెడ్డి

Jan 28 2023 7:52 PM | Updated on Jan 28 2023 8:18 PM

YS Avinash Reddy Key Comments Over CBI Investigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. అవినాష్‌ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు.  విచారణ అనంతరం అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని కోరాము. మా విజ్ఞప్తిని సీబీఐ అధికారులు అంగీకరించలేదు. వాస్తవాలను ఒక సెక్షన్‌ మీడియా వక్రీకరిస్తోంది. విచారణను ఒక మీడియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

కాగా, వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సాక్షిగా విచారించే క్రమం‍లో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement