హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌లో యూఎస్‌ వీసా దరఖాస్తు కేంద్రం

US Visa Application Centre Will Start At Hitech City Metro Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లో అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం ఆదివారం ప్రారంభం కానుంది. వీసా అప్లికేషన్‌ సెంటర్‌గా పిలిచే ఈ కేంద్రంలో అమెరికాకు వెళ్లాలనుకునేవారి వేలిముద్రల సేకరణ, వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ తదితర సేవలను అందించనున్నట్లు మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఏర్పాటుచేశారన్నారు.

స్టేషన్‌ మధ్యభాగం (కాన్‌కోర్స్‌)లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నా రు. కాగా ప్రస్తుతం ఈ కేంద్రం బేగంపేట్‌లోని కాన్సులేట్‌ సమీపంలోని గౌరా గ్రాండ్‌ భవన్‌లో ఉన్న విషయం విదితమే. నగరవాసులు, మెట్రో ప్రయాణికులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు కోరారు.    
చదవండి: Hyderabad: మలక్‌పేట హోటల్‌లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top