Hyderabad: మలక్‌పేట హోటల్‌లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి 

Fire Accident In Malakpet Hotel Hyderabad One Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేటలోని అక్బర్‌బాగ్‌ డివిజన్‌ నల్గొండ చౌరస్తాలోని సొహైల్‌ హోటల్‌లో శుక్రవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో హోటల్‌లో పనిచేస్తున్న కారి్మకుడు మృతిచెందాడు. చాదర్‌ఘాట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హోటల్‌ వంటగదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న షాబుద్దీన్‌ అనే కారి్మకుడు ఊపిరాడక మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే.. 
స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని రాజకీయ ఒత్తిళ్లతో లీజుకు తీసుకొని హోటల్‌ ఏర్పాటు చేయడమే కాకుండా...నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే ఓ నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. హోటల్‌లో ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలో హోటల్‌ లీజు అగ్రిమెంట్‌ను రద్దు చేసి ఒక భవనం నిర్మించి ఆసుపత్రి రోగులకు బెడ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు అనుకున్నారు.

తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు హోటల్‌ భవనాన్ని ఖాళీ చేయించలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక హోటల్‌ లీజును పొడిగించారు. ఇక హోటల్‌కు దగ్గరలోనే అగ్నిమాపక కేంద్రం ఉండటం వల్ల పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top