
కారుపై పడిన మరోకారు
ఉద్యోగంలో చేరేందుకు వెళ్తూ అనంత లోకాలకు
మహబూబ్ నగర్ జిల్లా: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరేందుకు విమానాశ్రయానికి కారులో వెళ్తున్న బావ, మరదలిని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కాటేసిన ఘటన మండల కేంద్రంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. వనపర్తి జి ల్లా పాన్‌గల్ మండలం చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరం రంజిత్‌కుమార్‌రెడ్డి (35) హైదరాబాద్‌లోని ఓ లిక్కర్ పరిశ్రమలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నా డు.
ఆదివారం పెత్తరామావాస్యకు అత్తగా రి ఊరైన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్‌కు భార్య చైతన్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో సోమ వారం భార్య సోదరి హారిక(25) బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరేందుకు వెళ్లా ల్సి ఉండగా, శంషాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేస్తానని బావ, మరదలు రెనాల్ట్ కారు నంబర్ టీ ఎస్ 07ఎఫ్‌ఎన్ 9768లో బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో రాజాపూర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా వీరు ప్రయాణిస్తున్న కారును హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కియా సెల్టాస్ ఏపీ 39జీఏ 2782 కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు ఇవతల వైపు వీరు ప్ర యాణిస్తు న్న కారుపై పడింది. దీంతో రంజిత్‌కుమార్‌రెడ్డి, హారిక కారులోనే ప్రాణా లు విడిచారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ ఎస్‌ఐ లెనిన్‌గౌడ్ మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చైతన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు. సుదర్శన్‌రెడ్డి, రాధమ్మలకు ఒక్కగానొక్క కుమారుడు రంజిత్‌కుమార్‌రెడ్డి, మృతుడి భార్య చైతన్య ప్రస్తుతం గర్భిణిగా ఉండటంతో పాటు 18 నెలల కుమార్తె ఉంది.