Telangana: TSRTC Bus Fire Accident In Suryapet - Sakshi
Sakshi News home page

TSRTC: రాజధాని బస్సులో మంటలు.. NH65పై ట్రాఫిక్‌ జామ్‌

Mar 30 2023 9:46 AM | Updated on Mar 30 2023 10:26 AM

TSRTC Rajdhani Bus Caught Fire In Suryapet District - Sakshi

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్‌ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్‌-65పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక, బస్సును మియాపూర్‌ డిపోకు చెందినదిగా గుర్తించారు. 

ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడు రాజును మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement