యూనివర్సిటీలకు అన్నివిధాలా  సాయం

TSCHE Officials Request UGC To Increase Funding: Jagadesh Kumar - Sakshi

యూజీసీ కొత్త చైర్మన్‌ హామీ ప్రొఫెసర్‌ జగదీశ్‌తో లింబాద్రి బృందం భేట

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచస్థాయి సాంకే తికతను చేరువ చేసేం దుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ముందుకు వచ్చింది.  యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం అంది స్తామని యూజీసీ తెలిపింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ల బృందం గురువారం ఢిల్లీలో యూజీసీ నూతన చైర్మన్‌ ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ను కలిసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తీసుకొస్తున్న మార్పులను, పురోగతిని వివరించారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ, బీకాం ఆనర్స్‌ కోర్సుల విషయాన్ని ప్రొఫెసర్‌ రవీందర్‌  యూజీసీ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వర్సిటీలకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ఫ్యాకల్టీ అభివృద్ధి, విద్యార్థులకు ఉపకార వేతనాలివ్వ డం, పరిశోధన విధానాలను విస్తరింపజేయడంపై విశ్వవిద్యాలయాలు ప్రధానంగా దృష్టి పెట్టాయని ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ యూజీసీ చైర్మన్‌కు వివరించారు. త్వరలో వీసీల సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, దానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా యూజీసీ చైర్మన్‌ అంగీకరించారు.

తర్వాత వారు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సామాజిక న్యాయ, సాధికారిత విభాగం కార్యదర్శి ఆర్‌.సుబ్రహ్మణ్యంను కలసి రాష్ట్రంలో వివిధ వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, లైబ్రరీ సదుపాయాలపై తోడ్పాటు గురించి చర్చించారు. అనంతరం ఈ సమావేశాల వివరాలను ప్రొఫెసర్‌ లింబాద్రి మీడియాకు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top