
వేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి
కరీంనగర్‌లో ఓ కాంపౌండర్ అఘాయిత్యం
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్న యువతిపై లైంగికదాడి జరిగింది. ఆస్పత్రి కాంపౌండర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కరీంనగర్ త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతి ఆరోగ్యం బాగోలేదని కరీంనగర్‌లోని శ్రీదీపిక ఆస్పత్రిలో శనివారం ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ అయ్యింది. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతిపై ఆదివారం వేకువజామున ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ దక్షిణామూర్తి (24) మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.
విషయాన్ని యువతి తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. బాధితురా లిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సీసీ పుటేజీలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఇతర పేషెంట్లు ఎవరైనా ఉన్నారా, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఎవరున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.