ఐదుగురు గుమికూడితే చర్యలే
● మూడో విడత ఎన్నికల్లో నిషేధాజ్ఞలు
కరీంనగర్‌క్రైం: ఈ నెల 17న మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న వీణవంక, హు జూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, వి– సైదాపూర్ మండలాల్లో నిషేధాజ్ఞలు విధిస్తున్న ట్లు సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం, సమావేశం కావడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 15వ తేదీ సాయంత్రం నుంచి 17 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘించిన వా రిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యానగర్(కరీంనగర్): రెండు రోజుల వరుస సెలవుల అనంతరం సోమవారం కరీంనగర్ బస్‌స్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో ప్రయాణికుల రద్దీని కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) పి.మల్లేశం పర్యవేక్షించారు. వివిధ రూట్లలో బస్సుల అందుబాటును పరిశీలించి, కరీంనగర్ బస్‌స్టేషన్‌లో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, బస్‌స్టేషన్ సూపర్‌వైజర్ రామకృష్ణకు సూచించారు.
కరీంనగర్: జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేస్తామని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 అమలు విధానంపై ఓరియంటేషన్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 598 ప్రైవేట్ హాస్పిటల్స్‌ను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్– 2010 కింద రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని, యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జి. వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–2010ను సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అధికారులు, రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు నాగరాజు, సునీల్ రాజు, వెంకటరమణ, మౌనిక పాల్గొన్నారు.
విద్యానగర్(కరీంనగర్): కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మూడు నెలల క్రితం రూ.5 పలికిన గుడ్డు ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్‌సేల్‌లో రూ.7 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.8 పలుకుతోంది. గత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు హోల్‌సెల్‌లో వందగుడ్లు రూ.550 పలకగా, ప్రస్తుతం 100 గుడ్లు రూ.650 వరకు విక్రయిస్తున్నారు. చలికాలం కావడంతో గుడ్ల వినియోగం పెరిగిందని, దీనికి తోడు రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరగడంతో గుడ్ల రేట్లు పెరుగుతున్నాయని, కోళ్లదాణా ఖర్చు పెరగడం కారణంగా ఫౌల్ట్రీఫామ్ యాజమానులు చెబుతున్నారు.
జమ్మికుంట: జమ్మికుంట పత్తి మార్కెట్‌లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,500 పలి కింది. సోమవారం మార్కెట్‌కు 52 వాహనాల్లో 300 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
ఐదుగురు గుమికూడితే చర్యలే
ఐదుగురు గుమికూడితే చర్యలే
ఐదుగురు గుమికూడితే చర్యలే


