మాట్లాడుతున్న మహేశ్‌గౌడ్, చిత్రంలో అనిల్, బీర్ల ఐలయ్య, సామేల్, ఎంపీ చామల
బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం కల్ల : మహేశ్‌గౌడ్
సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుంది..కార్యకర్తలు లేకుంటే పార్టీలు, ప్రభుత్వాలు ఉండవు.. పార్టీయే శాశ్వతం.. ఎందరో ప్రాణ త్యాగాల మీద నిర్మితమైన పార్టీ కాంగ్రెస్.. ఇది ప్రజల పార్టీ.. పార్టీ కోసం మనం కష్టపడితే ఫలితాలు దక్కుతాయి’అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహేశ్‌గౌడ్ మాట్లాడారు.
ఈ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మళ్లీ గెలవదని, ఏదైనా పోటీ ఉంటుందంటే అది బీజేపీతోనే అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుస్తుందని, డీలిమిటేషన్ చేస్తే 140 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఏప్రిల్ చివరి లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేల్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ చైర్మన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, పల్లె శ్రీనివాస్‌గౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీకనీకి వచ్చిండ్రా.. కార్యకర్తలపై ఎంపీ చామల ఫైర్
భువనగిరి ఎంపీ చామల కాంగ్రెస్ పార్టీ కేడ ర్‌పై సీరియస్ అయ్యారు. సభలో ఎంపీ మా ట్లాడుతున్న సమయంలో కొందరు కార్యక ర్తలు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆగ్ర హించిన ఎంపీ ఏయ్ మాట్లాడకండయ్యా. మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లా డుకోండి.. ఇక్కడ సీరియస్‌గా మాట్లాడు తుంటే పీకనీకి వచ్చిండ్రా ఈడ అని అన్నా రు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.


