మళ్లీ తెరపైకి ‘మల్కాపూర్‌’!

Telangana: Proposal To Build An Additional Reservoir At Malkapur - Sakshi

2018లోనే 10.78 టీఎంసీలతో చేపట్టేందుకు అనుమతి

టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక ఆగిన పనులు

పనులు మొదలుపెట్టేలా చూడాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు వరంగల్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వినతి

సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసేందుకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: దేవాదుల ప్రాజెక్టులో మల్కాపూర్‌ వద్ద అదనపు రిజర్వాయర్‌ నిర్మిం చాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. గోదావరి జలాల సమర్థ వినియోగం, గరిష్ట నీటిలభ్యతే దీని లక్ష్యం. మూడేళ్ల కిందటే దీనికి పరిపాలనా అనుమతులు ఇచ్చినా, టెండర్ల ప్రక్రియ పూర్తి అయినా కరోనా పరిస్థి తుల కారణంగా మూలనపడింది. ఈ రిజ ర్వాయర్‌ పనులను మళ్లీ మొదలు పెట్టాలని తాజాగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజాప్రతిని ధులంతా కోరుతున్నారు. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తేనే ఈ రిజర్వాయర్‌ పనులు కొనసాగించే అవకాశముండటంతో త్వరలోనే ఆయన్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అరవై టీఎంసీల నీటిని వినియోగించుకుం టూ 6.21 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరిచ్చేలా దేవాదుల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.

దీనిలో మొత్తంగా 17 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం కేవలం 8 టీఎంసీలు మాత్రమే. ఈ నేపథ్యం లో అదనపు నీటినిల్వలకుగాను వరంగల్‌ జిల్లా ఘనపూర్‌ మండలం లింగంపల్లి– మల్కాపూర్‌ వద్ద 10.78 టీఎంసీల సామ ర్థ్యం, రూ.3,227 కోట్ల వ్యయంతో రిజర్వా యర్‌ నిర్మించాలని నిర్ణయించి 2018 ఏప్రిల్‌ లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గోదావరికి వరద ఉండే 3 నెలల కాలంలో ధర్మసాగర్‌ నుంచి నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్‌ చేసింది. దీని వల్ల 4,060 ఎకరాలకు ముంపు ఉంటుందని అధికారులు తేల్చారు. నీటిని ఎత్తిపోసేందుకు ఏటా రూ.67.55 కోట్ల వరకు విద్యుత్‌ ఖర్చు ఉంటుందని అంచనా వేశారు.

రిజర్వాయర్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేసేలా ఎన్నికలకు ముందు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి చేసింది. అయితే ఒప్పందాలు చేసుకొని పనులు మొద లుపెట్టాల్సిన సమయంలో కోవిడ్‌–19 వచ్చి పడింది. ద్రవ్యోల్బణం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం, నిర్మాణంలోని ఇతర ప్రాజెక్టులకే భారీ నిధుల అవసరాలుం డటంతో ఈ పనులను మొదలు పెట్టలేదు. 

మూడేళ్లుగా అస్పష్టతే..
మూడేళ్లుగా పనులు మొదలుకాకపో వడంతో ఈ రిజర్వాయర్‌ను పూర్తిగా పక్కన పెట్టారని భావించినా, రెండ్రో జుల కిందట జరిగిన ఉమ్మడి వరంగల్‌ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 12 ని యోజకవర్గాల తాగు, సాగు అవసరా లను తీర్చే రిజర్వాయర్‌ నిర్మాణం మొద లు పెట్టాలని ఈ భేటీలో మంత్రులు సహా నేతలందరూ సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు విన్నవించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top