ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం | Telangana plans breakfast and lunch scheme for all government schools: Revanth Reddy | Sakshi
Sakshi News home page

ప్రతి చిన్నారికి విద్య, పోషకాహారం

Mar 27 2026 4:42 AM | Updated on Mar 27 2026 4:42 AM

Telangana plans breakfast and lunch scheme for all government schools: Revanth Reddy

సీఎం రేవంత్‌ రెడ్డితో ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క తదితరులు

పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం 

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

ఆర్థికవేత్త మురళీధరన్‌తో సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌ గురువారం సీఎంను కలిశారు. రాష్ట్రంలో 0–10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు, ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదన వివరించారు.

వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అయితే ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం చెప్పారు. మురళీధరన్‌తో సమన్వయం చేసుకుని ఆయా అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్‌ కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌ రాజ్, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్‌ సీఈవో దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement