KTR Vs Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు, 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని..

Telangana KTR Serve Legal Notices To Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు.. మంత్రి కేటీఆర్‌ శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపించారు.  ఈ నెల 11వ తేదీన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కేటీఆర్‌ తాజాగా డిమాండ్‌ చేశారు. ఆధారాలు చూపించకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్‌. 

ఈ నేపథ్యంలో.. తాజాగా లీగల్‌ నోటీసులు పంపడం విశేషం. 48 గంటల్లోపు స్పందించాలని నోటీసుల్లో కేటీఆర్‌, బండి సంజయ్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత బండి సంజయికి  నోటీసులు పంపించారు కేటీఆర్. 

నోటీసులో ఏముందంటే..
మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నాడు న్యాయవాది. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా... కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.  మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని సదరు న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతులు లేకుండా క్షమాపణ చెప్పాలని లీగల్‌ నోటీసుల్లో స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top