మనసులో ఏదో పెట్టుకుని రాజకీయం చేయొద్దు: కేటీఆర్‌

Telangana: KTR Accuses Centre Of Hindering City Development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/రసూల్‌పురా: కంటో న్మెంట్‌ అభివృద్ధికి సహకరించాల్సిందిగా రాష్ట్రం వచ్చినప్పటినుంచి కోరుతున్నా కేంద్రం మనసులో ఏదోపెట్టుకుని రాజకీయం చే\స్తోందని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామా రావు విమర్శించారు. సనత్‌నగర్, కంటో న్మెంట్, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధి లో రూ.61 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాంతాల్లో నాలా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రం సహకరించక పోయినా కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుల కోరిక మేరకు 20 వేల లీటర్ల తాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు.

డిఫెన్స్‌ భూమిలో 20 వేల మందికి నివాస స్థలాలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ కేంద్రం ఇవ్వడం లేదని, ఇచ్చిన భూమికి బదులు మరోచోట భూమి ఇస్తామన్నా పేదలకు పట్టాలివ్వకుండా అడ్డుపడుతోందని ఆరోపించారు. కంటో న్మెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మరో సారి కోరుతున్నామని, రాజకీయ దురు ద్దేశంతో అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని విన్నవించారు. రహదారుల విస్తరణకు సహకరించాలని కోరినా ముందుకు రాలేదని, అయినా తమ పోరాటం ఆగదని, ప్రయత్నం కొనసాగిస్తామని కేటీఆర్‌ స్పష్టంచేశారు. కొత్తగా రోడ్లు వేయాలని, కొత్త నాలాలను కట్టాలని, పేదలకు పట్టా లివ్వాలని తాము ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బోర్డు పరిధిలో రోడ్లు మూసివేస్తోందని మండిపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top