తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే.. | Telangana Govt New GO Released On Building Rules | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. కొత్త ఆదేశాలు ఇవే..

Mar 22 2026 10:45 AM | Updated on Mar 22 2026 10:55 AM

Telangana Govt New GO Released On Building Rules

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంపై ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో కీలక మార్పులు చేస్తూ టీడీఆర్‌ (Transferable Development Rights) వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి రానున్నాయి.

తెలంగాణలో నిర్మాణ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పెను మార్పులు చేసింది. 'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ - 2012'కు కీలక సవరణలు చేస్తూ G.O.Ms.No.95ను విడుదల చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ  స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ పేరుతో వెలువడిన ఈ జీవోలో టీడీఆర్‌ వినియోగం, హై-రైజ్ భవనాల గుర్తింపు, సెట్‌బ్యాక్ సడలింపులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

కొత్త ఆదేశాలు ఇలా.. 

  • 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై-రైజ్‌గా గుర్తింపు( పారిశ్రామిక భవనాల్లో ఉండే చిమ్నీలు, కూలింగ్ టవర్లు, బాయిలర్ రూములు, లిఫ్ట్ మెషిన్ రూములు, వాటర్ ట్యాంకులు, ఇతర నిర్మాణ ఫీచర్లను ఈ ఎత్తు లెక్కలోకి తీసుకోరు).

  • 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో TDR ద్వారా ఎత్తు పెంపు అనుమతి.

  • నాన్ హై-రైజ్ భవనాలకు సెట్‌బ్యాక్ సడలింపు అవకాశం.

  • హై-రైజ్ భవనాల్లో 10% వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి.

  • మాస్టర్ ప్లాన్ రోడ్లు మారితే TDR లేదా ఛార్జీలు చెల్లించే ఎంపిక.

  • 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అనుమతి.

  • 40 ఫీట్ల రోడ్డుపై 3 అంతస్తులు అదనంగా నిర్మాణం.

  • 60 ఫీట్ల రోడ్డుపై 4 అంతస్తులు అదనంగా అనుమతి

  • 80 ఫీట్ల రోడ్డుపై 5 అంతస్తులు వరకు అవకాశం.

  • 10 నుంచి 20 అంతస్తుల హై-రైజ్‌లో 3% TDR తప్పనిసరి

  • 20 అంతస్తులపై భవనాలకు 5% TDR తప్పనిసరి

  • బిల్డింగ్ పర్మిషన్ సమయంలో 50% TDR సమర్పణ

  • OC (Occupancy Certificate) ముందు మిగతా 50% సమర్పణ తప్పనిసరి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement