తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్‌ ఫార్మసీలు బంద్‌

Telangana Govt Mulls Shutting Down Private Pharmacies at Govt Hospitals - Sakshi

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం      

ప్రభుత్వమే ఉచిత మందులు ఇస్తున్నప్పుడు ఇవెందుకన్న భావన

రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్న ప్రైవేట్‌ మందుల దుకాణదారులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు వీటిని ఎందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వాటిని ఏర్పాటు చేసిన యాజమాన్యాల నుంచి రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఖాళీ చేయబోమని చెబుతున్నట్లు తెలిసింది.

అవసరమైతే కోర్టులకు వెళ్లి ఖాళీ చేయించకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తామన్నట్లు సమాచారం. అయితే చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా వీటిని ఎలా ఖాళీ చేయించాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఎత్తి వేయాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు.. అధికారులకు హుకుం జారీచేశారు. దీంతో తొలగింపునకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రైవేట్‌ దుకాణాలను ఎత్తివేయడమే కాకుండా.. తక్షణమే అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా అన్ని రకాల మందులు, అవసరమైనన్ని సరఫరా చేయాలని కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది.

రోజుకు రూ.లక్షల విక్రయాలు..
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు ఉచిత వైద్య సేవలు, చికిత్స అందించాలి. ఉచిత వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వాల్సిన బాధ్యత సర్కారు ఆసుపత్రులపై ఉంది. దీనికోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నింటికీ ప్రభుత్వమే ఉచితంగా మందులను సరఫరా చేస్తుంది. దీనికి ప్రభుత్వం మూడేళ్లుగా రూ.330 కోట్ల చొప్పున కేటాయించగా, ఈ ఏడాది రూ.500 కోట్లు కేటాయించింది. అయితే అనేక ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లోని ప్రాంగణాల్లో ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చిం ది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ వంటి బోధనాసుపత్రుల్లో అయితే రోజుకు రూ.ల క్షల విలువైన మందుల విక్రయాలు జరు గుతున్నాయి.

ఇలా వాటిని నెలకొల్పిన యాజమాన్యాలు నెలకు కోట్లు గడిస్తున్నాయి. ఉచిత మందులున్నా.. అనేక మంది డా క్టర్లు రోగులకు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవే ట్‌ మెడికల్‌ షాపుల వద్ద ఉన్న మందులే రాస్తున్నారు. బ్రాండెడ్‌ మందులే మంచి వన్న భావనను కల్పిస్తున్నారు. అంతేగాక కొన్ని ఆసుపత్రుల్లో కోర్సు ప్రకారం వాడా ల్సిన రోజులకు కాకుండా, తక్కువ రోజులకే మందులు ఇస్తున్నారు. ఉదాహరణకు నెల రోజులకు డాక్టర్‌ మందులు రాసిస్తే, వారంపది రోజులకే ఉచితంగా ఇస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండని పరిస్థితి. మరికొన్నిచోట్ల ఒక మం దు ఉంటే మరోటి ఉండదు. ఇలాంటి కార ణాలతో పేదలు ఆయా ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ మందుల దుకాణాల్లో కొంటున్నా రు. ఇక కొన్ని ఏరియా, జిల్లా ఆసు పత్రు ల్లోనూ ప్రైవేట్‌ జనరిక్‌ మందుల దుకా ణా లను నెలకొల్పారు. వాటిల్లోనూ పేదలు డ బ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుండటంతో ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఖాళీ చేయించాలని సర్కార్‌ నిర్ణయించింది. 

‘ప్రైవేట్‌’లో కొనుక్కోమని రాసిస్తే చర్యలు.. 
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రైవేట్‌ ఔషధ దుకాణాలను ఎత్తివేయాలన్న మంత్రి హరీశ్‌ ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్‌ మెడి కల్‌ షాపుల అవసరం ఏముంటుంది?. ఎక్కడైనా ప్రభుత్వ డాక్టర్లు ఉచి త మం దులు ఇవ్వకుండా ప్రైవేట్‌లో కొ నుక్కో మని రాసిస్తే చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్‌ అజయ్‌కుమార్, కమిషనర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top