అంగన్‌వాడీలను ఒంటిపూట నిర్వహించాలి | Telangana Govt Decides To Implement Half Day Classes In Anganwadi Centers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలను ఒంటిపూట నిర్వహించాలి

Mar 27 2026 4:25 AM | Updated on Mar 27 2026 4:25 AM

Telangana Govt Decides To Implement Half Day Classes In Anganwadi Centers

అంగన్‌వాడీ టీచర్ల సంఘం వినతి 

సాక్షి, హైదరాబాద్‌: వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఒంటి పూట నిర్వహణ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈమేరకు గురువారం ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం డైరెక్టరేట్‌లోనూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదేళ్లలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాల మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఒంటిపూట నిర్వహించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement