
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజ్‌భవన్‌కు లేఖ పంపించారు.‘రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మరెన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేసేందుకు మీపై దేవుడి ఆశీస్సులుండాలని ప్రార్థిస్తున్నా’అని లేఖలో పేర్కొన్నారు.
విబేధాల కారణంగా కొంత కాలంగా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.