పెట్రోల్‌, డీజిల్‌.. తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు | Telangana Civil Supply Issues Key Orders To Oil Companies | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌.. తెలంగాణ సర్కార్‌ కీలక ఆదేశాలు

Apr 30 2026 7:09 PM | Updated on Apr 30 2026 7:24 PM

Telangana Civil Supply Issues Key Orders To Oil Companies

సాక్షి, హైదరాబాద్‌: ఆయిల్‌ సంస్థలకు తెలంగాణ సివిల్‌ సప్లయ్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాను తక్షణమే 15 శాతం పెంచాలని ఆదేశించింది. బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టకూడదని.. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. డీజిల్ సరఫరా 190 శాతం పెరిగిందని.. 21,295 కిలో లీటర్లు పంపిణి  చేసినట్లు తెలిపారు.

పెట్రోల్ సరఫరా 118 పెంచామని తెలిపారు. మొత్తం ఫ్యూయల్ సరఫరా 158 శాతం పెరిగిందన్న  స్టీఫెన్ రవీంద్ర.. బ్లాక్ మార్కెటింగ్‌పై ప్రత్యేక దాడులు చేస్తున్నామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని.. ఇతర రాష్ట్ర వాహనాలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement