
ఖమ్మం జిల్లా: ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శీలం సంధ్య(40) పాముకాటుకు గురై చెందింది. ఆమె సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా కాలిపై పాము కాటు వేసింది. దీంత విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సంధ్యకు భర్త, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..
మధిర: మండలంలోని జిలుగుమాడులో సోమవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలసాని మురళీకృష్ణ(35) ఖమ్మంలో తాపీ పనులు చేస్తుండగా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన మాధవితో ఆయన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మూడేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మాధవి పుట్టింట్లో ఉంటుంది. ఆమెను తీసుకొచ్చేందుకు మురళీకృష్ణ ప్రయత్నించగా గొడవలు జరిగా యి. ఈక్రమంలోనే సోమవారం ఆయన పనికి వెళ్లి వచ్చాక, సమీపంలో ఉండే తల్లి క్యారేజీ తీసుకొని వెళ్లగా గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో స్థానికులు పరిశీలించేసరికి మురళీకృష్ణ మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని మధిర టౌన్ సీఐ రమేష్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.