Secunderabad Fire Accident: ‘డెక్కన్‌’లో ధిక్కరణ.. అడ్డగోలు నిర్మాణాలే అధికం..

Secunderabad Fire Accident Builders Not Following Rules - Sakshi

నిబంధనల ప్రకారం ఉండాల్సినవీ లేవు

అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెలుగులోకి

ముగ్గురి గల్లంతుతో తీవ్ర ఉత్కంఠ

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్‌ రోడ్‌లోని రాధా ఆర్కేడ్‌ భవనంలో డెక్కన్‌ కార్పొరేట్‌ భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంది. ఇందులో అడుగడునా ఫైర్‌ సేఫ్టీ మెజర్స్‌ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే గురువారం అగ్ని ప్రమాదంలో మంటల్ని అదుపు చేయడానికి పది గంటలకు పైగా శ్రమించాల్సి వచి్చంది. ముగ్గురు వ్యక్తులు గల్లంతు కావడంతో ఆందోళన కలిగిస్తోంది.   

ఉల్లంఘనలు ఇలా... 
ఈ భవనం సబ్‌–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్‌ ప్లస్‌ సిక్స్‌ ఫోర్లుగా నిర్మించారు. దీని విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాల్సి ఉన్నా కనిపించలేదు.  
భవనం చుట్టూ ఫైరింజిన్‌ తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో దక్షిణం వైపు ప్రధాన రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ఈ వాణిజ్య భవనం వెనుక, పక్కన నివాస సముదాయాలు ఉన్నాయి.  
ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్‌ కేస్‌ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్‌ స్టెయిర్‌ కేస్‌ కూడా అవసరమైన స్థాయిలో లేదు.  
ఇలాంటి వాణిజ్య భవనాలకు అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్‌ తప్పనిసరి. ‘డెక్కన్‌’లో వెతికినా ఇవి కనిపించలేదు. అగ్ని ప్రమాదం జరిగితే బయటపడటానికి ప్రత్యేక ఎగ్జిట్‌ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు.    
మండలార్పేందుకు ఈ భవనంలో ఫైర్‌ ఎక్స్‌టింగి్వషర్లు, వాటర్‌ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్‌ రైజర్‌ తప్పనిసరి. ఈ భవనంలో ఇవి ఉన్న దాఖలాలు లేవు.  
విద్యుత్‌ ఫైర్‌ అలారం, మాన్యువల్‌ ఫైర్‌ అలారం తప్పనిసరి. ఈ రెండూ మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్‌ వ్యవస్థ ఉండాలి. ఇలాంటింది ఎక్కడా కనిపించలేదని అగి్నమాక శాఖ అధికారులు చెబుతున్నారు.  
అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ ట్యాంక్, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ తప్పనిసరి. ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారు.  
అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ.. ‘డెక్కన్‌’లో ఎంత 
వెతికినా కనిపించవు.
చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top