HYD: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌ | Road Diversion In Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌

Apr 9 2026 10:51 AM | Updated on Apr 9 2026 12:40 PM

Road Diversion In Hyderabad

హైదరాబాద్‌: నగరంలోని వాహనదారులకు ట్రాఫిక్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో ఆరు లేన్ల అండర్‌ పాస్, మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్ల పనులు ప్రారంభమయ్యాయని.. దీంతో ఏడాది పాటు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సైబరాబాద్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి లింగంపల్లి వైపు వెళ్లేవారు ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌లో లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుని విప్రో జంక్షన్, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, నల్లగండ్ల మీదుగా వెళ్లాలని కోరారు. అలాగే లింగంపల్లి వైపు నుంచి గచ్చిబౌలి వైపు వచ్చేవారు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్‌ టర్న్‌ తీసుకుని మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవాలని పేర్కొన్నారు. 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి డీఎల్‌ఎఫ్‌ వైపు వచ్చే వాహనదారులు ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌న్‌నుంచి  స్టేడియం వద్ద రైట్‌ టర్న్‌ తీసుకుని గచి్చబౌలి జంక్షన్‌ నుంచి ఎడమ వైపు వెళ్లి డీఎల్‌ఎఫ్‌కు వెళ్లాలన్నారు. డీఎల్‌ఎఫ్‌ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వెళ్లేవారు లీ మెరీడియన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకుని గచ్చిబౌలి జంక్షన్, విప్రో జంక్షన్‌ వెళ్లాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు గమనించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement