బైక్‌ ఢీకొని యువతికి తీవ్ర గాయాలు | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని యువతికి తీవ్ర గాయాలు

Published Tue, Dec 26 2023 8:15 AM

Road Accidents in Himayatnagar - Sakshi

హిమాయత్‌నగర్‌: బస్‌స్టాప్‌లో బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని వేగంగా వచ్చిన బైక్‌ ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లిబర్టీ చౌరస్తా నుంచి ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే దారిలో మోర్‌ మెడికల్‌ షాప్‌ ఎదురుగా ఉన్న బస్‌ స్టాప్‌లో సోమవారం సాయంత్రం మయూరి అనే యువతి బస్సు కోసం ఎదురుచూస్తుండగా అదే సమయంలో హోండా యాక్టివాపై వేగంగా వచ్చిన యువకుడు ఆమెను ఢీకొట్టాడు.

తీవ్రంగా గాయపడిన ఆమెను ట్రాఫిక్‌ పోలీసులు 108 లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నారాయణగూడ పోలీసులు ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement