నిరాశాజనకమైన బడ్జెట్‌ 

Professor Narasimhareddy Says The Central Budget Was Disappointing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ సోషల్‌సైన్సెస్‌ విభాగం మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా వివిధ రంగాల్లో లెక్కకు మించిన వ్యక్తులు జీవనోపాధి కోల్పోవడంతో తలెత్తిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం అధికాదాయ వర్గాలపై పడలేదన్నారు. వారి ఆదాయంలో కోత లేకపోగా మెరుగైన కొనుగోలు శక్తి కలిగి ఉన్నారని తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలు మొదలుపెట్టామని ఆర్థిక మంత్రి చెబుతున్నా బడ్జెట్‌లో అలాంటి చర్యలేవి కనిపించలేదన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top