అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తున్న మంత్రులు పొంగులేటి, జూపల్లి, వాకిటి
కమీషన్లురావు కాబట్టే పేదల ఇళ్లు కట్టలేదు
బీఆర్‌ఎస్‌పై మంత్రి పొంగులేటి ధ్వజం
కవిత కొరివి దెయ్యం.. ఆ పార్టీలో చాలా దెయ్యాలున్నాయి: మంత్రి జూపల్లి
వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటన.. హాజరైన మరో మంత్రి వాకిటి శ్రీహరి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.

గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్‌ఎస్‌లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.