
నిర్వాహకురాలిపై బేగంపేట పోలీసుల కేసు
హైదరాబాద్: శ్మశానవాటికలో అయితే ఎలాంటి అనుమానం రాదనుకున్నదో ఏమో..ఓ మహిళ ఆ ప్రాంతాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చింది. యువతులను తీసుకువచ్చి విటులను ఆహా్వనించి ఆమె కొనసాగిస్తున్న వ్యభిచార గృహం గుట్టురట్టయ్యింది. నిర్వాహకురాలితో పాటు ఓ మహిళ, విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.
బేగంపేట శ్యాంలాల్‌బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉండడాన్ని గుర్తించారు. మారీ మాధవి (39) అనే మహిళ ఇక్కడి గదిని వ్యభిచార గృహంగా మార్చినట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను తీసుకువచ్చి విటులకు సమాచారం అందించి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో మాధవి ఒప్పుకుంది.
దీంతో నిర్వాహకురాలు మాధవితో పాటు గదిలో ఉన్న మహిళ, విటుడిగా వచ్చిన బాలానగర్‌కు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.