యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం 

Nizams Presents Gold Necklace To Lord Lakshmi Narasimha Swamy - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్‌ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్‌ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్‌రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.

శ్రీస్వామి వారి ప్రధానాల­యం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top