పాము కరిస్తే మంత్రం వేశారు! | Sakshi
Sakshi News home page

పాము కరిస్తే మంత్రం వేశారు!

Published Mon, Feb 27 2023 4:32 AM

Nizamabad Man Dies Of snakebite - Sakshi

ఎడపల్లి (బోధన్‌): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢ నమ్మకాలు విశ్వసిస్తున్నారు. పాము కరిస్తే వైద్యుడిని సంప్రదించకుండా మంత్రం వేయించుకోవడంతో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుర్నాపల్లికి చెందిన గంగారెడ్డి (51)కి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద బాత్‌రూంలో పాముకాటు వేసింది.

దీంతో స్థానికంగా ఉన్న పాము మంత్రం వేసే వారి వద్దకు వెళ్లి మంత్రం వేయించుకున్నాడు. అయితే గంటపాటు పాము మంత్రం వేసే వారి వద్ద ఉంచడంతో పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో గంగారెడ్డిని ఆటోలో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో మల్లాపూర్‌ గండి వద్ద ఆటోలో డీజిల్‌ అయిపోయింది. మరో ఆటోలోకి ఎక్కించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగారెడ్డి మృతి చెందాడ 

Advertisement
 
Advertisement
 
Advertisement