విషాదం: అసోంలో తెలంగాణ జవాన్‌ మృతి | Nalgonda Jawan Mahesh Dead At Assam | Sakshi
Sakshi News home page

విషాదం: అసోంలో తెలంగాణ జవాన్‌ మృతి

Jul 26 2024 9:37 AM | Updated on Jul 26 2024 11:48 AM

Nalgonda Jawan Mahesh Dead At Assam

సాక్షి, నల్లగొండ: తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్‌ ఈరేటి మహేష్‌ అసోంలో మృతిచెందాడు. నేడు అతడి భౌతికకాయం స్వగ్రామానికి రానున్నట్టు తెలుస్తోంది. రేపు అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి.

వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం మాదరిగూడెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ ఈరేటి మహేష్‌(24) అసోంలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, మహేష్‌కు ఇటీవల ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మహేష్‌ మృతిచెందాడు. దీంతో, నేడు అతడి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. రేపు స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు జరుగనున్నాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement