హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ అలుమిని మీట్ సోమవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. నోస్టాల్జియా 2026 పేరుతో నిర్వహించిన ఈ అలుమిని మీట్‌లో వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్ మాట్లాడుతూ కాలేజీ నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడి మన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఇది ఎంతో సంతోషకర విషయమని అన్నారు.

ప్రతియేటా డిసెంబర్‌లో ఈ అలుమిని మీట్ ఇక నుంచి తప్పకుండా జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులకు నాటి అధ్యాపకులకు సొసైటీ చైర్మన్ మహ్మద్ వలియుల్లా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ హేమరాజ్, అడ్వజర్ కమ్ డైరెక్టర్ మహిపాల్ సింగ్‌రావత్, రిజిస్ట్రార్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


