‘రైతు భరోసా నిధుల విడుదలలో మరోసారి రేవంత్ ప్రభుత్వం రికార్డు’ | Minister Tummala On Rythu Bharosa Funds | Sakshi
Sakshi News home page

‘రైతు భరోసా నిధుల విడుదలలో మరోసారి రేవంత్ ప్రభుత్వం రికార్డు’

Jul 3 2026 10:01 PM | Updated on Jul 3 2026 10:01 PM

Minister Tummala On Rythu Bharosa Funds
  • కేవలం 4 రోజులలోనే రైతుభరోసా పథకం కింద 6590.37 కోట్లు రైతు ఖాతాలలో జమ
  • ఈ రోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధుల విడుదల
  • నాలుగో విడతలో 4.41 లక్షల మంది రైతుల ఖాతాలలో 1188 కోట్లు జమ
  • ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది రైతులకు రూ.6590.37 కోట్ల రైతుభరోసా సాయం
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్: రైతుభరోసా నిధులను రైతు ఖాతాలలో వేయడంలో రేవంత్ సర్కార్ మరోసారి రికార్డు సృష్టించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 30 న రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమం మొదలుపెట్టిన కేవలం 4 రోజులలోనే రైతు భరోసా పథకం కింద 6590.37 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద ఈ రోజు నాలుగో విడతలో 4 నుండి 5 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో నేడు రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతులు రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఇప్పటికే మొదటి మూడు విడతలలో 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, ఈ రోజు 4 నుండి 5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుభరోసా సాయం అందించమన్నారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 65.76 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement