కులగణన చేసి తీరుతాం | Minister Ponnam at Mahesh Kumar Goud honor meeting | Sakshi
Sakshi News home page

కులగణన చేసి తీరుతాం

Sep 20 2024 4:06 AM | Updated on Sep 20 2024 4:06 AM

Minister Ponnam at Mahesh Kumar Goud honor meeting

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సన్మానసభలో మంత్రి పొన్నం  

గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్‌): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ కులగణనకు అంతా సిద్ధంగా ఉందని, దీనికి నిధులు కేటాయించినట్టు తెలిపారు. 

ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేశామని, వెనువెంటనే బీసీ కమిషన్‌ను కూడా నియమించామని గుర్తు చేశారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఇదే పార్లమెంట్‌లో కులగణన తీర్మానం చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. 

బడుగు, బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయేతరాలకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement