కొల్లాపూర్: సాంఘిక దురాచారాలు నమ్మవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో రాములు అనే వ్యక్తికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భూమిపూజ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. రాములు భార్య గర్భవతి కావడంతో మంత్రిని భూ మిపూజ చేయాలని కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కోరా రు. రాములు తల్లి లక్ష్మీదేవమ్మ చేత భూమి పూజ చేయించాల ని మంత్రి సూచించగా.. ఆమె వితంతువు అని కొందరు నాయకులు మంత్రికి వివరించారు.
వితంతువు అయితే భూ మి పూజ చేయకూడదా అంటూ మంత్రి వారిపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవమ్మను పిలిచి ఆమెతోనే ఇంటి నిర్మా ణానికి పూజ చేయించి.. కొబ్బరికాయ కొట్టించారు. అనంతరం మంత్రి భూమిపూజ, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ 200 ఏళ్ల క్రితమే రా జా రామ్మోహన్‌రాయ్ లాంటి మహనీయులు స్త్రీవిద్య, బాల్యవివాహాల రద్దు, వితంతు వివాహాలు వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత ఆధునిక సమా జంలో కూడా వితంతువులను శుభకార్యాలకు దూరంగా పెట్టడం సమంజసం కాదన్నారు. ఈ సాంఘిక దురాచారం మన సంస్కృతికి మచ్చ అని, ఇలాంటి కళంకాలను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని పిలుపునిచ్చారు.


