
కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు
గత ఏడాది నీట్ కటాఫ్ ర్యాంకుల ఆధారంగా నిపుణుల అంచనా
బీసీ–ఏ కేటగిరీలో గత ఏడాది కటాఫ్ ర్యాంక్ 3,36,989..
జనరల్ కేటగిరీలో 2.12 లక్షల ర్యాంకు రాష్ట్రం నుంచి 43,400 మంది
నీట్‌లో క్వాలిఫై మొదలైన ఆలిండియా కౌన్సెలింగ్ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: నీట్–యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 16 నుంచే రిజిస్ట్రేషన్లు మొదలు కాగా, సోమవారం నుంచి జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్ మొదలైంది. నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎన్‌ఎంసీసీ) ఆధ్వర్యంలో ఆలిండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన కళాశాలల్లో ప్రవేశాల కోసం మొదటి రౌండ్ ప్రక్రియ ఈనెల 30 వరకు జరుగుతుంది. అలాగే స్టేట్ కౌన్సెలింగ్ మొదటి దశలో ఈనెల 30 నుంచి ఆగస్టు 6 వరకు సాగుతుంది. మూడు రౌండ్‌లలో జరిగే ఈ ప్రక్రియ ఆలిండియా కోటా కింద సెప్టెంబర్ 10 వరకు, రాష్ట్ర కోటాలో సెపె్టంబర్ 18 వరకు సాగనుంది. అయితే ఎంత ర్యాంకు వస్తే కనీ్వనర్ కోటాలో సీటు దక్కుతుందనే విషయంపై విద్యార్థులు ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల నుంచి 15 శాతం సీట్లు
రాష్ట్రం నుంచి 43,400 మంది విద్యార్థులు నీట్‌కు అర్హత సాధించారు. ఆలిండియా కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలోని ప్రభు త్వ కళాశాలల నుంచి 15 శాతం సీట్లను కేటాయించను న్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ కాలేజీల్లోని 4,090 సీట్లలో 15% అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కింద వెళ్తాయి. వీటితోపాటు రాష్ట్రంలోని ఈఎస్‌ఐ కాలేజీలోని 125 సీట్లు, బీబీనగర్ ఎయిమ్స్‌లోని 100 సీట్లకు కౌన్సెలింగ్ మొదలైంది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం చాలా కఠినంగా రావడంతో మార్కులు తగ్గాయి. దాంతో ఆలిండియా టాప్ స్కోర్ 686 మార్కులే. రాష్ట్రం నుంచి 670 మార్కులే అత్యధికం.
రాష్ట్ర ర్యాంకుల్లో 10వేల కన్నా ఎక్కువ వచ్చినా..
గత ఏడాది జనరల్ కేటగిరీలో ఆలిండియా నీట్ ర్యాంకు 2.12 లక్షలు (చివరిర్యాంకు) వచ్చిన విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీటు దక్కింది. విద్యా ర్థినుల్లో 1.98 లక్షల వచి్చన వారికి కూడా సీటు వచి్చంది. బీసీ– ఏ కేటగిరీలో అత్యధికంగా 3,36,989 ర్యాంకు వచి్చన విద్యార్థికి, బీసీ–ఏ మహిళా కేటగిరీలో 3.31 లక్షల ర్యాంకు వచి్చన విద్యారి్థనికి కనీ్వనర్ కోటాలో సీటు దక్కింది. ఈ ఏడాది ఇంతకన్నా ఎక్కువ ర్యాంకు వచి్చనా. కనీ్వనర్ కోటా లో సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–సీ, ఎస్‌సీ, ఎస్టీ కేటగిరీలోని విద్యార్థులకు ఈసారి నీట్‌లో 3 లక్షల ర్యాంకుపైనా, రాష్ట్ర ర్యాంకుల్లో 10వేల ర్యాంకు కన్నా ఎక్కువ వచి్చన వారికి కూడా కనీ్వనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
రాష్ట్రంలో సీట్లు ఇలా..
రాష్ట్రంలో 34 రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, వాటిలో 4,090 సీట్లు ఉన్నాయి. వాటిలో 15 శాతం ఆలిండియా కోటా పోను 3,477 సీట్లు తెలంగాణవాసులకు దక్కుతాయి. 25 ప్రైవేటు కాలేజీల్లో 4,200 సీట్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం అంటే 2,100 సీట్లు కనీ్వనర్ కోటాలో తెలంగాణ వాసులకే దక్కనున్నాయి. ఇవికాకుండా మల్లారెడ్డి డీమ్డ్ వర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఇందులోని 400 సీట్లు పూర్తిగా ప్రైవేటులోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈఎస్‌ఐ (150 సీట్లు), బీబీ నగర్ ఎయిమ్స్ (100 సీట్లు)లో ఆలిండియా కౌన్సెలింగ్‌లోనే వంద శాతం సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని మొత్తం కళాశాలల్లో కలిపి 8,915 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, స్టేట్ కోటాలో దక్కేవి మాత్రం 5,577 మాత్రమే. కాగా దివ్యాంగులకు సంబంధించి వైకల్యాన్ని నిర్ధారించేందుకు నిమ్స్ ఆసుపత్రిని ఎంపిక చేశారు.