రాయికల్(జగిత్యాల): కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజను తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్‌తో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు.
ఎందుకు వండలేదని మందలించాడు. పిల్లలు కారంతో అన్నం తింటుండడంతో వంట చేసేందుకని సుధాకర్ వంటింట్లోకి వెళ్లాడు. మనోజ వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సుధాకర్ వచ్చి చూసేసరికే మృతిచెందింది. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


