సినిమా చూస్తుండగా కూలిన థియేటర్‌ సీలింగ్‌ | Mahabubabad Mukunda Theatre Slab Collapsed | Sakshi
Sakshi News home page

సినిమా చూస్తుండగా కూలిన థియేటర్‌ సీలింగ్‌

Jun 27 2025 12:14 PM | Updated on Jun 27 2025 1:00 PM

Mahabubabad Mukunda Theatre Slab Collapsed

మహబూబాబాద్‌ రూరల్‌: సినిమా చూస్తున్న ప్రేక్షకులపై ఒక్కసారిగా సీలింగ్‌ పడగా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏషియన్‌ ముకుంద థియేటర్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.  థియేటర్లో బుధవారం ప్రేక్షకులు ‘కుబేర’ సినిమా చూస్తున్నారు. 

రాత్రి సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సీలింగ్‌ పైకప్పుభాగం ఊడిపడడంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురై వెంటనే థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా, కొద్దిసేపు ఉల్లాసం కోసం వస్తే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement