Live Updates
ఈ జిల్లాలకు తాకిన పెట్రోల్ సెగ
తిరువూరులో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన వాహనదారులు
- భారత్ పెట్రోలియం బంక్ ముందు భారీ క్యూతో గందరగోళం
ఆంధ్రప్రదేశ్‌లోనూ గందరగోళం
- కృష్ణా జిల్లాలో పెటట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- కైకలూరులో నో స్టాక్ బోర్డులు దర్శనం
- ఏలూరులో పెట్రోల్ సరఫరాలపై గందరగోళం
బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
- ఖమ్మం జిల్లాకు కూడా తగిలిన పెట్రోల్ సెగ
- బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
- వైరా నియోజకవర్గంలో ఇండియన్ పెట్రోల్ బంకుల్లో నో పెట్రోల్
- గందరగోళానికి గురవుతున్న వాహనదారులు
పెట్రోల్ బంక్‌లు క్లోజ్ చేస్తే చర్యలు
- డిమాండ్ 25 శాతం పెరిగింది
- 1,200 ట్యాంకర్లు సప్లై చేస్తున్నాయి
- పెట్రోల్ బంక్‌లు క్లోజ్ చేస్తే చర్యలు
- బంక్‌లకు క్రెడిట్ సమస్య లేదు
-తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం: ఉత్తమ్
- తెలంగాణ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు
- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ షార్టేజ్ లేదు
- మీరు ఎక్కువ స్టోర్ చేసుకుంటే మీకే ప్రమాదకరం
- రాష్ట్రంలో రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంది
- సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంతా మానిటరింగ్ చేస్తుంది
- రూమర్స్, ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు...
- ఒకే సారి డ్రమ్‌లు, కంటైనర్లు నింపితే చట్ట విరుద్ధం..చర్యలు తప్పవు
60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది: కలెక్టర్ హరిచందన
- పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వదంతులు నమ్మవద్దు
- పెట్రోల్ బంక్‌లలో కావాల్సినంత సప్లై జరుగుతుంది
- సోషల్ మీడియాలో వచ్చిన కథనాలతో చాలా మంది ప్యానిక్ అయ్యారు
- 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ ఉంది
- హైదరాబాద్ సీపీ అద్వర్యంలో అధికారులతో రివ్యూ చేశాము
- ముందస్తుగా పెట్రోల్, డీజీల్‌ను స్టోర్ చేసుకోవద్దని కోరుతున్నాం
-హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి: సజ్జనార్
- హైదరాబాదులో పెట్రోల్ డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దు
- కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
- గుజరాత్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ దొరకడం లేదంటూ వార్తలు వచ్చాయి
- హైదరాబాదులో కూడా అదేవిధంగా ఉంది నమ్మి చాలామంది పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ లో ఉంటున్నారు
- 60 రోజులకు సరిపడా పెట్రోలు తెలంగాణ రాష్ట్రంలో ఉంది
- ఎవరు కూడా అపోహలు నమ్మవద్దు
- సోషల్ మీడియా వార్తలపై నిఘా పెట్టాము
- హైదరాబాద్ పరిధిలో ఉన్న 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నాం
- వీసీ సజ్జనార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్
No shortage of fuel or LPG cylinders in #Hyderabad. Citizens are requested not to panic or indulge in unnecessary rush that may create disruption. The situation is being closely monitored. Please remain calm and cooperate. https://t.co/WkCO4L2JbO pic.twitter.com/Wp1K6X5DmQ
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 25, 2026
బంకుల్లో ఇదీ పరిస్థితి.. వీడియో వైరల్
- బంకుల్లో ఇదీ పరిస్థితి..
- సోషల్ మీడియాలో వదంతుల నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో రద్దీ.
- ఏకంగా స్టీల్ బకెట్లు, క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న వీడియోలు వైరల్.
This is the situation at petrol and diesel bunks #Hyderabad #FuelCrisis #Petrol #Diesel #Rush #BreakingNews pic.twitter.com/Fe2g5gZvZX
— Telangana Ahead (@telanganaahead) March 25, 2026
ఇంధనం కొరత అంటూ అసత్య ప్రచారం.. ఉన్నతాధికారుల మీడియా సమావేశం
- ఇంధనం కొరత అంటూ అసత్య ప్రచారం
- అసత్య ప్రచారాన్ని ఖండించిన ఉన్నతాధికారులు
- హైదరాబాద్ జిల్లాలో పెట్రోలియం ప్రొడక్ట్స్ పై ఐసీసీసీలో సీపీ సజ్జనార్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, సివిల్ సప్లై అధికారులు మీడియా సమావేశం
- మీడియా సమావేశంలో ఇంధన సరఫరాపై మాట్లాడనున్న అధికారులు
- ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం .
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష.
- ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
- ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చ
పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు..
- పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు..
- షేక్‌పేట్‌లో ఇదీ పరిస్థితి..

ఇంధనం కొరతపై పుకార్లు నమ్మోద్దు : భారత్ పెట్రోలియం
- దేశంలో ఇంధనం కొరత అంటూ పుకార్లు
- పుకార్లపై భారత్ పెట్రోలియం అధికారిక ప్రకటన
- కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు
- ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే.
- భారతదేశంలో ఇంధన కొరత లేదు
- వాస్తవానికి, భారత్ పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది.
- ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) తగినంత నిల్వ ఉన్నాయి.
- సరఫరా వ్యవస్థలో ఎలాంటి అభ్యంతరాలు లేవు.
- భారత్ పెట్రోలియం సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.
- అంతరాయం లేని సరఫరాను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము..
- ప్రజలు భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దు.
- పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉంది.
కొరత లేదు: స్టీఫెన్ రవీంద్ర
- స్టీఫెన్ రవీంద్ర, పౌరసరఫరాల కమిషనర్
- రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.
- వదంతులు నమ్మొద్దు.
- వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దు.
- నిన్న ఒక్క రోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంక్‌లకు పంపిణీ చేశాం.
- సుమారు 20వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉంది.
- రోజు వారి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయి.
వదంతులను నమ్మకండి: బండి సంజయ్
- రాష్ట్ర ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఝప్తి
- సోషల్ మీడియా వదంతులను నమ్మకండి
- పెట్రోలు, డీజిల్ కొరత లేనేలేదు
- ఆయిల్ సంస్థల వద్ద అవసరానికి సరిపడ పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయి.
- ఈ మేరకు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది
- ఆయిల్ సరఫరాలోనూ ఇబ్బందుల్లేవు
- పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది
- మోదీ ప్రభుత్వం ఆయిల్ నిల్వలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది
- వదంతలు నమ్మి అవసరానికి మించి పెట్రోలు కొనడంవల్ల కృతిమ కొరత ఏర్పడే ప్రమాదం
పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన..
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత లేదు: పౌరసరఫరాలశాఖ
- ప్రజలు భయాందోళనలకు గురికావొద్దు.
- రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా సక్రమంగా జరుగుతోంది.
- ప్రజావసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
- వదంతుల వల్లే ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లు పెరిగాయి.
- వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా కొనుగోలు చేస్తున్నారు.

కొరత లేదు: హిందూస్థాన్ పెట్రోలియం
- పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని ప్రకటించిన హిందూస్థాన్ పెట్రోలియం
- భయాందోళనలతో ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లవద్దని హెచ్‌పీసీఎల్ విజ్ఞప్తి
- సాధారణ అవసరాలకు అనుగుణంగా ఇంధనం నింపుకోవాలని హెచ్‌పీసీఎల్ విజ్ఞప్తి
- ఇంధన సరఫరా సక్రమంగా ఉంచేందుకు హెచ్‌పీసీఎల్ కట్టుబడి ఉందని వెల్లడి
హైదరాబాద్ సిటీలో పెట్రోల్ టెన్షన్..
- సిటీలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత
- బంకుల వద్ద వాహనదారులు క్యూలైన్లు
- వాహనాల రద్దీతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్..
- వాహనదారుల్లో టెన్షన్..
Panic Buying led to #NoStock boards or #HugeRush , Long Queues at Several #PetrolPumps across #Hyderabad
No Shortage of #Petrol, #Diesel or #LPG in #Telangana: Civil Supplies dept
"No Stock" board at Petrol pump, Budwel in #Rajendranagar area.
Petrol Pumps witness a huge rush… pic.twitter.com/9tDtHgitF0— Surya Reddy (@jsuryareddy) March 25, 2026
ఏపీలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
- ఎన్టీఆర్ జిల్లా..
- ఏపీలో కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
- చందర్లపాడు, కంచికచర్ల మండలాల్లో గ్యాస్ కొరత
- రెండు రోజులుగా గ్యాస్ ఏజన్సీల వద్ద సిలిండర్ల కోసం జనం పడిగాపులు
- కంచికచర్ల మండలం జుజ్జూరులో గ్యాస్ ఏజన్సీ ఎదుట బారులు తీరిన ప్రజలు
- ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా దగ్గరుండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు
- బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు
- జగిత్యాల..
- జగిత్యాలలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు
- పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు
- పెట్రోల్ కొరతపై వదంతులతో వాహనదారుల ఆందోళన
- ఒకరిని చూసి మరొకరు బంకుల వద్దకు పరుగులు
- క్యూ లైన్లలో తోపులాట, గందరగోళం
- అవసరం లేకపోయినా ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్న ప్రజలు
- పెట్రోల్ సరఫరాపై స్పష్టత లేక ప్రజల్లో భయం..
యుద్ధ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు
హైదరాబాద్‌లో పలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు.. గంటల తరబడి లైన్లో వేచి చూస్తున్న వాహనదారులు
కిలోమీటర్ల మేర వాహనాల క్యూలు
కొన్ని… https://t.co/4Wabing6Eq pic.twitter.com/gJjPMmkd1h— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
తిరువూరులో భారీగా క్యూ..
- ఎన్టీఆర్ జిల్లా..
- తిరువూరులో పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ..
- పట్టణంలో ఉన్న మూడు పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ లేని కారణంగా రెండు క్లోజ్..
- ఉన్న ఒక రిలయన్స్ బంక్ ముందర భారీగా క్యూ కట్టిన వాహనదారులు..
- పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో ఆందోళన చెందుతున్న జనం..
- ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో మూతపడ్డ పలు పెట్రోల్ బంకులు..
- నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా పెట్రోల్ కొరత
- పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు
- కంచికచర్లలో పెట్రోల్ కోసం బారులు తీరిన వినియోగదారులు
- బైకులు, బాటిల్స్ తో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు
- కంచికచర్ల పట్టణంలో రెండు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు
- కంపెనీలు తమకు ఆయిల్ ట్యాంకర్ల స్టాక్ ఇవ్వడం లేదని స్టాక్ ఇస్తే తప్ప తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసిన బంక్ యజమానులు
బంకులు బంద్
- సిద్దిపేట జిల్లా
- గజ్వేల్, ప్రజ్ఞాపూర్ పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ కోసం భారీగా లైన్
- క్యూ కట్టిన వాహనదారులు.
- ఇప్పటికే గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
- సోషల్ మీడియాలలో వదంతుల ఎఫెక్ట్.. బాటిల్స్‌తో పెట్రోల్, డీజిల్ కోసం భారీ లైన్
నిజామాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత
- నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత
- బంకుల వద్ద క్యూ కడుతున్న వాహనదారులు
- పలుచోట్ల మూతపడ్డ బంకులు
- నో స్టాక్ బోర్డులు ఏర్పాటు
- పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయనే ప్రచారంతో బంకుల వద్దకు పరుగులు పెడుతున్న వాహనదారులు
- అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్న వాహనదారులు
- కొరత లేదంటున్న అధికారులు
- వాహనదారుల్లో టెన్షన్
నో స్టాక్ బోర్డులు
- నో స్టాక్ బోర్డులు
- మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రతరమైన పెట్రోల్, డీజిల్ కొరత..
- చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు
- పలు బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
- స్పీడ్ పెట్రోల్‌తో 10 రూపాయల అదనపు భారంతో వినియోగదారుల గగ్గోలు
డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన
- డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన
- తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ కీలక ప్రకటన
- తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు
- ఆయిల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి
- అవసరానికి మించి ఎవరు కొనుగోలు చేయవద్దు
పెట్రోల్, గ్యాస్ నిల్వలపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
- పెట్రోల్, గ్యాస్ నిల్వలపై నేడు సీఎం రేవంత్ సమీక్ష
- రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.
- ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
- ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చ.



