పోస్టల్‌ సేవలపై అయోమయం | Letter red post box services discontinue | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ సేవలపై అయోమయం

Aug 18 2025 7:39 AM | Updated on Aug 18 2025 7:39 AM

Letter red post box services discontinue

ఇప్పటికే రిజిస్టర్డ్‌ పోస్ట్‌సేవల నిలిపివేత నిర్ణయం

తాజాగా లెటర్‌ రెడ్‌ (పోస్ట్‌) బాక్స్‌ ఎత్తివేత ప్రచారం 

 అవి ఊహాగానాలే అంటున్న తపాలా వర్గాలు 

 ఈ– సేవల విస్తరణలో పోస్టల్‌ శాఖ నిమగ్నం

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ  ఈ– సేవల విస్తరణ కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్‌ శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలుసేవలు రద్దు కాగా.. సెపె్టంబర్‌ ఒకటి నుంచి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు లెటర్‌ రెడ్‌ (పోస్టట్‌) బాక్స్‌లను కూడా ఎత్తి వేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రధానంగా పోస్టల్‌ శాఖ నూతన ఒరవడితో ఈ– సేవల విసర్తణపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకైక దిక్కు తపాలానే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతిక  టెక్నాలజీకితో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అప్‌గ్రేడ్‌ అవుతూ వస్తోంది.   

రిజిస్టర్డ్‌ పోస్టులకు మంగళం.. 
పోస్టల్‌ శాఖ రిజిస్టర్డ్‌ పోస్టు సేవలకు మంగళం పాడనుంది. తాజాగా బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలు సెప్టెంబర్‌ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పోస్ట్‌మాస్టర్‌లకు శాఖాపరమైన  నోటీస్‌లు జారీ చేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా.. ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్ట్‌కార్డు లేదా రిజిస్టర్డ్‌ పోస్ట్‌ మాత్రమే అందుబాటులో ఉండేది.

సుమారు 171 ఏళ్లుగా.. 
పోస్టల్‌ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌  ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో ముందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిషర్‌ లార్డ్‌ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్‌ ఆఫీస్‌ చట్టంతో æసేవలు 
ప్రారంభమయ్యాయి. అంతకు ముందు 1766లో వారెన్‌  హేస్టింగ్స్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో ‘కంపెనీ మెయిల్‌’ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్‌ నోటీసులు, అపాయింట్‌మెంట్‌ లెటర్లు, బ్యాంకింగ్‌ సంబంధిత పత్రాలు వంటివాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్‌) పొందడం ఒక ప్రత్యేకత, చట్టపరంగానూ ఎంతో విలువైనది. ఇది కాస్త మరో రెండు వారాల్లో కనుమరుగు కానుంది!  

స్పీడ్‌ పోస్ట్‌లో విలీనం.. 
రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవను పూర్తిగా ‘స్పీడ్‌ పోస్ట్‌’ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. తపాలా శాఖ తమ సేవలను ఆధునికీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్‌ సేవల క్రమబదీ్ధకరణ,  పనితీరును మెరుగుపరచడం, ట్రాకింగ్‌ వ్యవస్థను బలోపేతం తదితర  ప్రక్రియలో భాగంగానే స్పీడ్‌ పోస్ట్‌లో రిజిస్టర్డ్‌ పోస్ట్‌ను విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్‌ పోస్ట్‌ అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలు స్పీడ్‌ పోస్ట్‌లో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతం కానుంది. స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా పార్శిల్‌ ఎక్కడి వరకు చేరిందో ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది రిజిస్టర్డ్‌ పోస్ట్‌లో లేదు. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్‌ శాఖ పని మరింత సులభమవుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

రెడ్‌ పోస్ట్‌ బాక్స్‌పై ఊహాగానమే.. 
రిజిస్టర్డ్‌  పోస్ట్‌  సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్‌ పోస్ట్‌ బాక్స్‌ల ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోస్టల్‌ అభిమానాలు కలత చెందుతున్నారు.దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదన్న బాధ్యత వ్యక్తమవుతోంది. అయితే.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని. అది ఒక ఊహాగానం మాత్రమేనని పోస్టల్‌వర్గాలు పేర్కొంటున్నాయి.  పోస్టల్‌ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్‌ బాక్సులను ఎత్తేస్తున్నట్లు అధికా>రిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం రిజిస్టర్డ్‌ పోస్టల్‌ సరీ్వస్‌ను స్పీడ్‌ పోస్టులో విలీనం తప్ప ఇది ఎరుపు పోస్ట్‌ బాక్సులతో సంబంధం లేదని పేర్కొంటున్నారు.

తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత..   
వాస్తవంగా రిజిస్టర్డ్‌ పోస్ట్‌ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీమెయిల్‌ వంటి డిజిటల్‌ మాధ్యమాల రాకతో సమాచార మారి్పడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్‌ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. ఐదేళ్లలో జరిగిన రిజిస్టర్డ్‌ పోస్ట్‌ బుకింగ్‌ పరిశీలిస్తే.. 25 శాతానికి పడిపోయింది. స్పీడ్‌ పోస్ట్, ఇతర కొరియర్‌ సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్‌ పోస్ట్‌కు డిమాండ్‌ తగ్గింది. అయితే..  తాజాగా స్పీడ్‌ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్‌ పోస్ట్‌  కనీసæ చార్జీ రూ. 26  నుంచి రూ. 30 వరకు ఉంటుంది. స్పీడ్‌ పోస్ట్‌ కనీస చార్జీ రూ.41. ఇది రిజిస్టర్డ్‌ పోస్ట్‌తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీలు భరించక తప్పదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement