సింగర్‌ మంగ్లీ కేసులో హైడ్రామా | Lawyer Subbarao Fierce Moment With Police | Sakshi
Sakshi News home page

సింగర్‌ మంగ్లీ కేసులో హైడ్రామా

Apr 14 2026 7:44 AM | Updated on Apr 14 2026 7:54 AM

Lawyer Subbarao Fierce Moment With Police

హైదరాబాద్‌: సింగర్‌ మంగ్లీ కేసులో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాది సుబ్బారావు అలియాస్‌ సుబ్బు సోమవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు రాగా  అతని నుంచి ఆల్కహాల్‌ వాసన వస్తుందని  పోలీసులు ఆల్కహాల్‌ టెస్ట్‌ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్‌ రావడంతో డ్రైవింగ్‌ చేసేందుకు అనుకూలమే కాని మద్యం తాగి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదికి మధ్యలో వాగ్వాదం చేటుచేసుకుంది.  

ఆర్థిక లావాదేవీలపై తనకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ పేర్కొన్నారు. గత వారం మధు అనే వ్యక్తి, సింగర్‌ మంగ్లీ తమ్ముడు తనను బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారని అయితే ఆధారాలు సమరి్పంచాలని   కోరినా ఆయన స్పందించలేదన్నారు. అయితే సత్యవతి అలియాస్‌ మంగ్లీ తనను బెదిరిస్తున్నారని, డబ్బులు డిమాండ్‌ చేశారని ఆదివారం ఫిర్యాదు చేశారని.. దీనిపై లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement